<strong>విజయనగరంః</strong> ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న నాయకుడు వచ్చి తమ సమస్యలు తెలుసుకోవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత శత్రుచర్త పరిక్షీత్ రాజు అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో చెరకు రైతులు బకాయిలు, అగ్రిగోల్డ్ బాధితులు, ఒట్టి గడ్డ,గుమ్మిడిగడ్డ వంటి సమస్యలను వైయస్ జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. జంఝావతి ప్రాజెక్టు విషయంలో టీడీపీ ప్రభుత్వం ఒకసారి కూడా ఒరిస్సా ప్రభుత్వంతో చర్చలు జరపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో వలసలు అధికంగా ఉన్నాయన్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా వైయస్ జగన్‌మోహన్ రెడ్డితో కలిసి నడుస్తున్నారు. ప్రజలకు మేలు చేయాలని సంకల్పం,కసి,పట్టుదలతో వైయస్ జగన్ ప్రజల వద్దకు వెళ్ళి స్వయంగా సమస్యలు తెలుసుకుంటారన్నారు.