టీడీపీ అధికారం దుర్వినియోగం...

చంద్రబాబు తీరుపై  వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన  ధ్వజం.

శ్రీకాకుళంః  గెలుపు కోసం  టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. అధికారం కోసం ఓటర్ల జాబితాల్లో  అవకతవకలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.బోగస్‌ ఓట్లను చేరుస్తూ ప్రతిపక్షానికి చెందిన ఓట్లను తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలుపు కోసం టీడీపీ ఎంతటి నీచానికైనా దిగజారుతోందనీ, ఎన్నికల అధికారే 25 లక్షల 47వేల ఓట్లు అనుమానాస్పదంగా ఉన్నాయని ప్రకటించారంటేనే పరిస్థితులను అర్థం చేసుకోవచ్చన్నారు. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా బోగస్‌ ఓటర్లను చేరుస్తున్నారన్నారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు సంపాదించిన 4 లక్షల కోట్ల అవినీతి సొమ్ము, పోలీస్‌ వ్యవస్థలను వాడుకోవడం, ఎన్నికల నిర్వహణలో ఉన్న లొసుగులను ఆసరగా చేసుకుని వచ్చే  ఎన్నికలలో గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారన్నారు. టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ప్రజావ్యతిరేకత ఉండటంతో  చంద్రబాబు తనకు అనుకూలమైన అధికారులను నియమించి  దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అన్నారు.  కొందరు అధికారులు చంద్రబాబుకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు.  అవినీతిని సమర్థించే అధికారులు రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారనే విషయం గ్రహించాలన్నారు.  
 
Back to Top