కసితో రగిలిపోతున్న బాబు గ్యాంగ్

() కొంత కాలంగా కక్ష పెట్టుకొన్న టీడీపీ శ్రేణులు

() చంద్రగిరి నియోజక వర్గం కేంద్రంగా వేధింపులు

() పోరాడుతున్నందుకే కక్ష, వేధింపులు

() అయినా పోరు సాగుతుందని ప్రతిఘటించిన చెవిరెడ్డి

 

తిరుపతి) చిత్తూరు జిల్లాలో అరాచకం మరోసారి బట్టబయలైంది. ప్రతిపక్ష ఎమ్మెల్యే
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ని లక్ష్యంగా పెట్టుకొని మరోసారి టీడీపీ నాయకులు
రెచ్చిపోయారు. తెలుగుదేశం నాయకుల గుప్పిట్లో కీలుబొమ్మలుగా మారిపోయిన చిత్తూరు
జిల్లా పోలీసు యంత్రాంగం ఖాకీ దుస్తులకు తలవంపులు తెచ్చిపెట్టింది. మూడు రోజల్లో
మూడు కేసుల్లో అరెస్టులు చేసి పచ్చ గూండాల సేవలో పోలీసులు తరించారు.

 

చంద్రగిరి ప్రత్యేకత ఏమిటంటే

రాష్ట్ర వ్యాప్తంగా చంద్రగిరి నియోజక వర్గానికి ప్రత్యేకత ఉంది. ముఖ్యమంత్రిగా
గొప్పలు చెప్పుకొనే చంద్రబాబు సొంత గ్రామం ఇక్కడే ఉంది. నారావారి పల్లె ఉండటం ఒక
ప్రత్యేకత అయితే ఇదే నియోజకవర్గం చంద్రబాబుకి మొదటి ఓటిమిని రుచి చూపించింది.
తర్వాత చంద్రబాబు పారిపోయి కుప్పం నుంచి పోటీ చేస్తూంటే, ఇక్కడ 1,2 సార్లు తప్ప
ఎప్పుడూ టీడీపీ గెలవలేదు. అంతే కాదు, టీడీపీ ముదురు నేతలు అయిన ఎంపీ శివప్రసాద్,
గల్లా అరుణకుమారి, గాలి ముద్దు క్రిష్ణమనాయుడు వంటి నాయకుల సొంత గ్రామాలు ఇదే
నియోజకవర్గంలో ఉన్నాయి. దీంతో రాజకీయంగా ఈ నియోజకవర్గానికి ప్రాధాన్యం ఏర్పడింది.

 

కొరుకుడు పడని చెవిరెడ్డి

మొన్నటి ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైయస్సార్సీపీ తరపున ఎన్నికైన
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చురుకైన ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. ప్రజల అవసరాలు
కనుక్కొంటూ, స్థానికంగా మంచి పేరు తెచ్చుకోవటంతో టీడీపీ పరిస్థితి అడుగంటింది.
దీంతో చెవిరెడ్డి మీద కక్ష సాధించేందుకు అనేకసార్లు దొంగ ప్రయత్నాలు చేశారు.
తాజాగా రాష్ట్రమంతా సాక్షి చానెల్ ప్రసారాల్ని నిలిపివేయించినప్పుడు, ఎమ్మెల్యే
చెవిరెడ్డి చాకచక్యంగా వ్యవహరించి ప్రసారాలు నిలిచిపోకుండా ఎదురొడ్డారు. టీడీపీ
ఆటలు సాగనివ్వకుండా నియోజకవర్గంలో ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించటంతో పాటు
రాష్ట్రంలో ప్రతిపక్ష వైయస్సార్సీపీ తరపున చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయన
మీద కక్ష తీర్చుకోలేని టీడీపీ నాయకులు, ఆఖరికి పార్టీ కార్యకర్తల మీద పడ్డారు. ఒక
వైయస్సార్సీపీ కార్యకర్త ఇంటిని కూల్చేందుకు అడ్డదారిలో ప్రయత్నించినప్పుడు
ఎమ్మెల్యే చెవిరెడ్డి అడ్డు పడ్డారు. దీంతో టీడీపీ నాయకులు కుటిలబుద్దిని బయట
పెట్టుకొన్నారు.

 

వరుస అరెస్టులు

విధులకు అడ్డం తగులుతున్నారంటూ ఎమ్మెల్యే చెవిరెడ్డి
భాస్కర్ రెడ్డిని ఎమ్మార్ పల్లి పోలీసులు అరెస్టు చేశారు.
ఎటువంటి చట్ట ప్రకారమైన మార్గాలు లేనందున ఆయన్ని విడిచిపెట్టారు. దీంతో
మనస్తాపానికి లోనైన శాసనసభ్యుడు చెవిరెడ్డి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన
తెలిపారు.   2013 లో ఎన్నికల్ కోడ్
ఉల్లంఘించారన్న కేసును వెదకి పట్టుకొని మళ్లీ పోలీసులు అరెస్టు చేసి చిత్తూరు సబ్
జైలుకి తరలించారు. బెయిల్ రాకుండా చేసేందుకు ఒక సర్కిల్ ఇన్ స్పెక్టర్ కోర్టు
దగ్గరే మకాం వేసి రక రకాల సాకులతో అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. చివరకు సాయంత్రం దాకా
అడ్డుపడినప్పటికీ బెయిల్ తీసుకోగలిగారు. తర్వాత బెయిల్ మీద బయటకు విడుదల  చేసేందుకు రాత్రంతా వేధించారు. మర్నాడు ఆయన్ని తీసుకొని
వస్తుంటే మరోసారి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సారి చూపిన కారణం సబ్ కలెక్టర్
కార్యాలయం దగ్గర వాచ్ మన్ విదులకు అడ్డం కలిగించారనే అభియోగం. దీనికి నాన్
బెయిలబుల్ కేసులు కట్టి అరెస్టు చేశారు. ఏడు సెక్షన్ల కింద కేసులు కట్టి కడప
సెంట్రల్ జైలుకి తరలించారు.

 

పచ్చ చొక్కాల్లోకి మారిపోయిన ఖాకీ అధికారులు

చిత్తూరు జిల్లాలో కొందరు పోలీసు అధికారులు టీడీపీ నేతల
భజనలో మునిగిపోయారు. మానం, మర్యాద గాలికి వదిలేసి ప్రతిపక్షాల్ని వేధించేందుకు
ఎంతకైనా తెగిస్తున్నారు. ఇటువంటి అధికారుల్ని గుప్పిట్లో పెట్టుకొని టీడీపీ నేతలు
ప్రజల తరపున పనిచేస్తున్న చెవిరెడ్డి వంటి నాయకుల్ని హింసించసాగింది. ఈ సందర్భంగా
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి వేధింపులకు భయపడేది లేదని
స్పష్టం చేశారు. మరింతగా ప్రజల తరపున దుర్మార్గ ప్రభుత్వంతో పోరాడతామని
హెచ్చరించారు.

 

తాజా ఫోటోలు

Back to Top