ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం

ప్రతిపక్షనేతగా నాలుగున్నరేళ్లలో అనేక పోరాటాలు
వైయస్‌ జగన్‌ సమర్ధవంతమైన నాయకుడు 
విశాఖ వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు
విశాఖపట్నం: ప్రజలకు మంచి చేయాలనేదే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సంకల్పమని పార్టీ విశాఖ నేతలు అంటున్నారు. 264వ రోజు ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న వారంతా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జననేత ముఖ్యమంత్రి కావాలన్నారు. నాలుగున్నరేళ్లుగా ప్రతిపక్షనేతగా ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేసి ప్రభుత్వ మెడలు వంచారన్నారు. సమర్ధవంతమైన నాయకుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. భీమిలి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను జననేత దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రజలంతా వేలాదిగా తరలివస్తున్నారన్నారు. అదే విధంగా విశాఖలో వందల కోట్లు దోపిడీ చేసిన టీడీపీ పెద్దలకు శిక్ష పడే సమయం దగ్గరలోనే ఉందన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి రాగానే టీడీపీ అవినీతి, అరాచకాలపై విచారణ చేపట్టి దోషులను శిక్షిస్తామని చెప్పారు. 

నవంబర్‌ 6వ తేదీన ఇడుపులపాయ నుంచి మొదలైన ప్రజా సంకల్పయాత్ర విశాఖ జిల్లాలో మూడు వేల కిలోమీటర్ల మైలురాయి దాటుతుండడం ఆనందంగా ఉందన్నారు. మూడు వేల కిలోమీటర్లు దాటిన తరువాత వైయస్‌ జగన్‌ పైలాన్‌ ఆవిష్కరించనున్నారని చెప్పారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయని వివరించారు. వైయస్‌ జగన్‌ నాయకత్వాన్ని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. 
 
Back to Top