చంద్రబాబుకు ప్రజలే బుద్ది చెబుతారు

పెనమలూరుః అధికార మదంతో రెచ్చిపోతూ,ప్రతిపక్ష నాయకుల పై అక్రమంగా కేసులు పెడుతూ ,ఇచ్చిన హామీలు నెరవేర్చకుడా ప్రజలను మోసంచేసి అధికారంలో ఉన్న చంద్రబాబుకు రానున్న కాలంలో ప్రజలే తగిన బుద్ది చెబుతారని వైయస్సార్‌కాంగ్రెస్‌ జిల్లా అధికార ప్రతినిధి కొఠారి శ్రీనివాసరావు అన్నారు .కానూరులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.నంద్యాల ఎన్నికల్లో టీడీపీకి త్వరలో ప్రజలే బుద్ది చెప్పనున్నారన్నారు.ఈ సమావేశంలో మండల ఎస్సీ విభాగం అధ్యక్షుడు గద్దలరాజేంద్ర, బీసీ విభాగం అధ్యక్షుడు మరీదు శ్రీనివాసరావు,ఎంపీటీసీలు చాంద్‌బాషా,ఖాదర్,పఠాన్‌అహ్మద్‌ పలువురు పాల్గొన్నారు.

Back to Top