ప్రజా సంకల్పయాత్రలో వినతుల వెల్లువ..


సమస్యలు తెలుసుకుంటూ సాగుతున్న జననేత..
వైయస్‌ జగన్‌ను కలిసిన రైతులు,మహిళలు,విద్యార్థులు

శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో జననేత వైయస్‌ జగన్‌ను కలిసి వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు.రైతులు,మహిళలు, విద్యార్థులు తమ సమస్యలను  జననేత దృష్టికి తీసుకెళ్లారు.వి.భానమ్మ అనే మహిళ  ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం నుంచి తనను  అకారణంగా తొలగిచారని వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకుంది. చాపరకు చెందిన రాజారావు కుటుంబ సభ్యులు తన కుమారుడు బ్రెయిన్‌ కేన్సర్‌తో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేదని వైయస్‌ జగన్‌కు చెప్పుకుని వాపోయారు. వైయస్‌ జగన్‌ను కలిసిన భాను అనే మహిళ  తమ పిల్లలు చదువుకున్నా ఉద్యోగాలు రావడంలేదని తెలిపింది. వైయస్‌ జగన్‌ను కలిసిన చాపర జెడ్పీ స్కూల్‌ విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకున్నారు. టెన్త్‌ పరీక్షలు దగ్గర పడుతున్న టెక్ట్స్‌ బుక్స్‌ ఇవ్వలేదని జననేత ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.వైయస్‌ జగన్‌ను కలిసిన డొక్కా జానకమ్మ  అనే వృద్ధురాలు తిత్లీ పరిహారం ఇంకా అందలేదని. పెన్షన్‌ రావడంలేదని మొరపెట్టుకుంది. వైయస్‌ జగన్‌ను కలిసిన పాతపట్నం నియోజకవర్గ రైతులు వైయస్‌ జగన్‌ దృష్టికి తమ సమస్యలు తీసుకువచ్చారు. రుణమాఫీ  అందక ఇబ్బందులు పడుతున్నామని, ఏకకాలంలో రుణమాఫీ జరగకపోవడంతో బ్యాంకులు తిరిగి రుణాలు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు..తమను ఎగవేతదారులుగా బ్యాంకర్లు చూస్తున్నారన్నారు.అవమాన భారంతో  కుంగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జాడుపల్లి గ్రామానికి చెందిన కౌలు రైతు కోట భీముడు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్య చెప్పుకున్నారు. తుపాను వల్ల ఆరు ఎకరాల్లో  వేసిన పంట పోయిందని రూపాయి కూడా పరిహారం అందలేదని వైయస్‌ జగన్‌ను వివరించారు.

 

Back to Top