పార్టీ మారడం సిగ్గు..సిగ్గు

డబ్బులకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలకు చుక్కెదురు
ఛీ కొడుతున్న ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు, పార్టీ శ్రేణులు
తమ ఓటు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్
చంద్రబాబు అనైతిక రాజకీయాలపై మండిపాటు

డ‌బ్బులకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను ఆయా నియోజకవర్గాల్లో ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు,  పార్టీ నాయకులు ఛీ కొడుతున్నారు. నైతిక విలువలు కోల్పోయిన ఎమ్మెల్యేలను, అనైతికంగా అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. బాబు అక్రమ సంపాదనకు ఆశపడి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఎక్కడిక్కడ చుక్కలు చూపిస్తున్నారు. చంద్రబాబు అరాచక పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రజాసమస్యలను గాలికొదిలి...సంతలో పశువుల మాదిరి ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగిస్తున్న బాబుపై దుమ్మెత్తిపోస్తున్నారు. 

ఓ పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం నీచాతి నీచమని మండిపడుతున్నారు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ చంద్రబాబు రాష్ట్రంలో దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. హామీలను గంగలో కలిపి అనైతిక కార్యకలాపాలకు పాల్పడడం సిగ్గుచేటని ధ్వజమెత్తుతున్నారు. ఈక్రమంలోనే  పలమనూరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పచ్చకండువా కప్పుకోవడంపై స్థానిక ప్రజలు,  వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ క‌ష్టంతో గెలిచి త‌మ అభిప్రాయానికి విరుద్ధంగా పార్టీ మార‌డ‌డంపై తీవ్ర‌స్థాయిలో నిర‌స‌న‌ వ్య‌క్తం చేస్తున్నారు. వి. కోట మండ‌ల కేంద్రంలో అమ‌ర్‌నాథ్‌రెడ్డికి వ్య‌తిరేకంగా ఓ బ్యాన‌ర్‌ను ప్ర‌ద‌ర్శించారు. 

ఆ బ్యాన‌ర్‌పై ఆ రోజు పార్టీలోకి ఎవ‌రూ మిమ్మ‌ల్ని ర‌మ్మ‌న‌లేదు. అలాగే ఈ రోజు మీరు వెళ‌తానంటే ఎవ‌రూ ఆపేదీ లేదు. కానీ మిమ్మ‌ల్ని మేము ఓటు వేసి గెలిపించింది మాత్రం వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిని అని గుర్తుంచుకోండి. అమ‌ర్‌నాథ్ రెడ్డి మీరు పార్టీ మారితే మాకేం న‌ష్టం లేదు. కానీ మా ఓటు మాకు తిరిగి ఇచ్చేయండి.. ఓట‌ర్లుగా(పౌరుడిగా) మాకు విలువ ఉంది. ఓటుకు (రాజ్యాంగానికి) కూడా ఎంతో విలువ ఉంది. త‌ర‌చూ పార్టీలు మారే ఎమ్మెల్యేగా మీకు విలువుందా?  అని బ్యాన‌ర్ ద్వారా ప్ర‌శ్నించారు. పార్టీ మారడం సిగ్గు.. సిగ్గు అని దుయ్యబట్టారు. 
Back to Top