పాదయాత్రలో ప.గో. జిల్లా ప్రముఖులు

నల్లజర్ల(పశ్చిమ గోదావరి జిల్లా) 20 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆమె పాదయాత్రలో జిల్లాకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారు. నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం నుంచి శ్రీమతి షర్మిల సోమవారం ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర సోమవారానికి 154వ రోజుకు చేరింది. పాదయాత్ర ప్రకాశరావుపాలెం, డాక్టర్ వైయస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ, వెంకట్రామన్నగూడెం మీదుగా సాగుతుంది. షర్మిల పాదయాత్రలో వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, చేగొండి హరిరామజోగయ్య పాల్గొన్నారు.  పాదయాత్ర సోమవారం 12.4 కిలోమీటర్ల మేర సాగనుందని పార్టీ రాష్ట్ర కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో ప్రారంభమయ్యే పాదయాత్ర ఆ రోజు రాత్రి వెంకట్రామన్నగూడెం చేరుతుందని పేర్కొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top