జగన్‌ సమక్షంలో ఎన్ఎంయు మహమూద్ చేరిక

హైదరాబాద్ :

ఆర్‌టీసీ నేషనల్ మజ్దూ‌ర్ యూనియ‌న్ ప్రధాన కార్యదర్శి సయ్య‌ద్ మహమూ‌ద్ శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వై‌యస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దినేశ్‌రెడ్డితో పాటు ఆయన కూడా శ్రీ జగన్‌ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. నష్టాలతో చతికిల పడిన ఆర్టీసీకి జీవం పోసిన మహనీయుడు వైయస్ఆర్ అని ‌మహమూ‌ద్ కొనియాడారు. ఆయన మాదిరిగానే ఈ సంస్థను నిలబెడతానని ఎన్నికల మేనిఫెస్టోలో పెడతామని శ్రీ జగన్ చెప్పారని వివరించారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తికావాలన్నా, ఆంధ్రప్రదేశ్‌ బాగుపడాలన్నా శ్రీ జగన్ సీఎం కావాల్సిందే‌ అన్నారు. శ్రీ వైయస్ జగ‌న్‌కు ఆర్టీసీ కార్మికుల తరపున తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పారు.

మహానేత వైయస్‌ వల్ల మా కుమార్తె డాక్టరైంది :
మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఫలితంగా తన కుమార్తెకు మెడిసి‌న్‌లో సీటు వచ్చిందని మహమూద్ చెప్పారు. తన కుమార్తె ఇపుడు ఎంబీబీఎ‌స్ పూర్తిచేసి గాంధీ ఆసుపత్రిలో డాక్ట‌ర్‌గా పనిచేస్తోందన్నారు. ఇలా ఎందరో ముస్లింలు వైయస్ఆర్ వల్ల పెద్ద చదువులు చదవగలిగారని ఆయన చెప్పారు.

వైయస్ఆర్‌సీపీలో మాజీ ఎమ్మెల్సీ గోపీనాథ్ చేరిక‌ :
చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆర్.గోపీనాథ్, ఆయన కుమారుడు ఆర్.రూపేష్ వై‌యస్ఆర్‌సీపీలో చేరారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట వైయస్ఆ‌ర్‌సీపీ కో ఆర్డినేటర్ మిథు‌న్‌రెడ్డి ఆధ్వర్యంలో వారు సోమవారం శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా గోపీనాథ్, ఆయన కుమారుడు ఇద్దరికీ శ్రీ జగన్మోహన్‌రెడ్డి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. గోపీనాథ్ 1985కు ముందు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు.

Back to Top