వైయ‌స్సార్‌సీపీలోకి భారీ చేరిక‌లు

సంగారెడ్డి(నేర‌డిగుంట‌): వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్య‌క్షుడు గౌరిరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో జోగిపేట మండ‌ల ప‌రిధిలోని నేర‌డిగుంట గ్రామాస్తులు భారీగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా జిల్లా అధ్య‌క్షుడు శ్రీధ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావు బంగారు తెలంగాణ అంటూ ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ప్ర‌జాభిప్రాయానికి వ్య‌తిరేకంగా జిల్లాల‌ను విభ‌జించ‌డం దారుణ‌మ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. కేసీఆర్‌కు త్వ‌ర‌లోనే ప్ర‌జ‌లు త‌గిన బుద్ధి చెబుతార‌న్నారు. పార్టీలో చేరిన వారికి వైయ‌స్సార్‌సీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి బి. సంజీవ‌రావు పార్టీ కండువాల‌ను క‌ప్పి ఆహ్వానించారు. అనంత‌రం సంజీవ‌రావు మాట్లాడుతూ... దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చేప‌ట్టిన సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌చారం చేయాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శి ర‌మేష్‌, ఎస్సీ సెల్ ప‌రిపూర్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు. 
Back to Top