<br/><br/>నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ జిల్లా కార్యదర్శి యేసు నాయుడుతో పాటు డివిజన్ నేతలు నేల్ సాయిరామ్, అశోక్, శ్రీనివాసరావు, నరసింహులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం నెల్లూరు పట్టణంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమక్షంలో వీరు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువాలు కప్పి టీడీపీ నాయకులను వైయస్ఆర్‌సీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..వైయస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకుందామని, ఐక్యంగా పని చేసి వైయస్ఆర్‌సీపీని అధికారంలోకి తీసుకువద్దామని పిలుపునిచ్చారు. పార్టీలో కష్టపడి పని చేసేవారికి గుర్తింపు ఉంటుందని చెప్పారు.