ప్రజలను బాబు శత్రువులుగా చూస్తున్నాడు

బాబు కేసీఆర్,మోడీలను చూసి బుద్ధి తెచ్చుకో
నియోజకవర్గాల అభివృద్ధికి నిధులివ్వమని..
మంత్రి యనమల చెప్పడం దారుణం

హైదరాబాద్ః టీడీపీ అధికారంలో ఉన్నంతవరకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు  నిధులు ఇచ్చే ప్రసక్తే లేదని మంత్రి య‌న‌మ‌ల రామకృష్ణుడు చెప్పడం దారుణమని  ఎమ్మెల్యే నారాయణస్వామి మండిపడ్డారు. ప్ర‌ధాని మోడీ పార్టీలకతీతంగా ఎంపీలందరికీ అం రూ. 5 కోట్ల నిధులు కేటాయించార‌ని,  తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం పార్టీల‌క‌తీతంగా ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 3 కోట్ల‌ను కేటాయించారని చెప్పారు. వాళ్లను చూసైనా  చంద్ర‌బాబు బుద్ధి తెచ్చుకోవాలని చురక అంటించారు. ఎమ్మెల్యేల‌కు ఫండ్స్ కావాలంటే నేరుగా ముఖ్య‌మంత్రి ద‌గ్గ‌రికి వెళ్లాల‌ని య‌మ‌న‌ల చెప్ప‌డం వెనుక అంత‌ర్యం ఏంటో అంద‌రికీ బాగా తెలుసున‌ని, ఏవిధంగా ఎమ్మెల్యేల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేసి వారిని కొనుగోలు చేస్తున్నారో ప్ర‌జ‌లంతా గ‌మ‌నిస్తున్నార‌న్నారు. 

దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కుల‌మ‌తాలకతీతంగా అన్ని పార్టీల ఎమ్మెల్యేల‌కు స‌హక‌రించి, ఇందిర‌మ్మ ఇంటి ప‌థ‌కం పేరుతో పేద‌లంద‌రికీ ఇళ్ల‌ను మంజూరు చేశార‌న్నారు. వైఎస్సార్ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను క‌లుపుకొని పోతూ అంద‌రితోనూ స్నేహపూర్వ‌కంగా ఉన్నార‌ని చెప్పారు. కానీ చంద్ర‌బాబు నాయుడు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు శ‌త్రువుగా మారుతున్నార‌ని ఆరోపించారు.  చంద్రబాబు ఎక్కడికెళ్లినా రాష్ట్ర  ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డుతున్నార‌ని అన్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో టీడీపీ క‌నీసం ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా గెలవ‌డం క‌ష్ట‌త‌ర‌మేన‌న్నారు. 

చంద్రబాబు ద‌ళితుల‌ను ఏవిధంగా అణ‌గ‌దొక్కారో అదేవిధంగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌ను సైతం అణ‌గ‌దొక్కుతున్నార‌ని ఆరోపించారు. తన నియోజ‌క‌వ‌ర్గంలోని ఆరు మండ‌లాల్లో 62 మ‌ట్టి రోడ్లున్నాయ‌ని, క‌నీసం వాటిని బీటీ రోడ్లుగా కూడా చేయ‌డం లేద‌ని మండిప‌డ్డారు. 1978లో చంద్ర‌బాబు కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గానికి  ఎమ్మెల్యేగా పోటీ చేసిన స‌మ‌యంలో ఆయ‌న అక్క‌డి ప్ర‌జ‌ల‌కు మ‌ట్టి రోడ్ల‌న్నీ బీటీరోడ్లుగా మారుస్తాన‌ని హామీఇచ్చార‌ని మ‌రి ఆ హామీ ఏమైంద‌ని ప్ర‌శ్నించారు. 

Back to Top