నేటి షర్మిల పాదయాత్ర 17.5 కి.మీ.

మహబూబ్‌నగర్:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర బుధవారం గద్వాల శివారులోని నోబెల్ స్కూల్ నుంచి ప్రారంభమవుతుంది. బుధవారం నాటి పాదయాత్ర సాగే తీరును  పార్టీ  కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి వివరించారు. సంగాల చెరువు, సంగాల క్రాస్ రోడ్, గోనుపాడు, ధరూర్, మన్నాపురం మీదుగా నెట్టెంపాడు ప్రాజెక్టుకు చేరుకుని ఆ రాత్రికి అక్కడే బస చేస్తారరు. షర్మిల మొత్తం 17.5 కి.మీ నడుస్తారని వారు పేర్కొన్నారు.

Back to Top