ప‌న్నుల మోత‌.. భ‌రించ లేనంత‌..!

పాల‌కొల్లు) చంద్ర‌బాబు నాయుడు ప‌రిపాల‌న‌లో ప‌న్నుల మోత భ‌రించ‌లేనంత‌గా పెరిగిపోయింద‌ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మండిప‌డ్డారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పాల‌కొల్లులోని పూల‌పల్లి పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌జ‌ల న‌డ్డి విరిచే విధంగా ప‌న్నుల్ని అమ‌లుచేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. చంద్ర‌బాబు పాల‌న‌లోకి వ‌చ్చాకే విద్యుత్ చార్జీల మోతెక్కుతున్నాయ‌ని చెప్పారు. దొడ్డి దారిన ఆర్టీసీ బ‌స్సుల్లో చార్జీలు పెంచార‌ని పేర్కొన్నారు. మునిసిపాలిటీల్లో ఇంటి ప‌న్నులు, నీటి ప‌న్నులు పెంచేశార‌ని వివ‌రించారు. సామాన్యుల‌కు చంద్ర‌బాబు పాల‌న‌తో విసుగు క‌లుగుతోంద‌ని శేషుబాబు చెప్పారు. 
Back to Top