ఎమ్మెల్యేలను పశువులతో పోలుస్తారా?

వైరా 20 నవంబర్ 2012 : ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేలను చంద్రబాబు పశువులతో పోల్చడం ఆయన కుసంస్కృతికి నిదర్శనమని వైయస్ఆర్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్ రావు వ్యాఖ్యానించారు. ఖమ్మంజిల్లా వైరాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబు నీతులు వల్లిస్తే ప్రజలు నమ్మేస్థితుల్లో లేరన్నారు.పాదయాత్ర పేరుతో బాబు గ్రామాల్లోకి రావడాన్ని ప్రజలు అరిష్టంగా భావిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ వివిధ పార్టీల నుంచి జనం భారీగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, జలగం వెంకట్రావు చేరికతో ఖమ్మం జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన అన్నారు. రాష్ట్రం లో తెలుగుదేశం, కాంగ్రెస్‌ మరణశయ్యపై ఉన్నాయన్నారు.

Back to Top