కోవూరుకు చేరిన ఎమ్మెల్యే గోపిరెడ్డి పాదయాత్ర

నెల్లూరు:

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంశిస్తూ గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర నెల్లూరు జిల్లా కోవూరుకు చేరింది. 21వ తేదీ నరసరావుపేటలో మొదలైన పాదయాత్ర 3వ తేదీన తిరుమలకు చేరుకుంటుంది. ఈ సందర్భంగా కోవూరులో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయశాఖామంత్రి సొంత జిల్లాలోనే రైతులు అవస్థలు పడుతున్నారని, ఇదే టీడీపీ పనితీరుకు నిదర్శనమన్నారు. ప్రజలు ఆకాంక్షించిన విధంగా పాలన సాగాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యం తిరిగొస్తుందన్నారు. 

Back to Top