బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అరెస్ట్‌

క‌ర్నూలు: బంద్‌లో పాల్గొనేందుకు వెళుతున్న పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా బేతంచర్లలో బుగ్గన నివాసం వద్ద ఉదయం నుంచి పోలీసులు హల్‌ చల్‌ చేశారు. బంద్‌లో పాల్గొనేందుకు ఇంటి నుంచి బయటకు రాగానే బుగ్గనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Back to Top