పవన్‌ ఇంత చవటనా?–పవన్‌కు ఎథీక్స్, విలువలు ఉన్నాయా?
– చిరంజీవిని మోసం చేసిన మొదటి వ్యక్తి పవనే
– పవన్, చంద్రబాబు ఓ పెద్ద డ్రామా కంపెనీ
– వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదు

 
నెల్లూరు: జననేత అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఫైర్‌ అయ్యారు. తాను అభిమానించే సినీ నటుడు ఇంత చ‌వటా అని ఆయన బాధపడ్డారు. చిరంజీవి ఓడిపోగానే ఆయనను మోసం చేసిన మొదటి వ్యక్తి  పవన్‌ కళ్యాణే అని విమర్శించారు. చంద్రబాబుకు ఏ కష్టం వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ హడావుడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులపై చంద్రబాబును పవన్‌ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. చంద్రబాబును వెనుకేసుకు రావడం పవన్‌కు అలవాటు అయ్యిందన్నారు.  పవన్‌ కళ్యాణ్‌ రాజ్యాంగాలు, ఎథీక్స్, విలువలు అని మాట్లాడుతున్నారని, మా పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు తీసుకెళ్తే మాట్లాడలేని నీకు ఎథీక్స్‌ ఉన్నాయా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా అని పవన్‌ను నిలదీశారు. నేను చదువుకునే రోజుల్లో నీ అభిమానినే అని, అయితే ఈ రోజు నీ తీరు చూసి బాధపడుతున్నానని ధ్వజమెత్తారు. ఒకప్పుడు నేను సినిమాల్లో అభిమానించిన వ్యక్తి ఇంత చవటా అని బాధపడుతున్నానన్నారు. ఇంతలా ఒక వ్యక్తి వెనకాలా దాక్కుంటాడా? ఇంత అధైర్యస్తుడా అని ఆవేదన వ్యక్తం చేశారు. నీవేం నాయకుడివే అర్థం కావడం లేదని ఫైర్‌ అయ్యారు. ప్రత్యేక హోదా తెచ్చే స్థాయి నాకు లేదు, నేను చిన్న వ్యక్తిని అంటున్నావు..అలాంటప్పుడు దేన్ని ప్రశ్నిస్తావని మండిపడ్డారు. చంద్రబాబుకు కష్టం వచ్చినప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్న వైయస్‌ జగన్‌ను ప్రశ్నిస్తావా అన్నారు. మీరు మాత్రం పార్టీలు పెట్టుకొని ముఖ్యమంత్రులు కావాలని కోరుకోవచ్చు. వైనయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 8 సంవత్సరాలుగా ప్రజల కోసం పోరాడుతున్నా..ముఖ్యమంత్రి కావాలని కోరుకోకూడదా? చంద్రబాబు లాంటి వ్యక్తి కొడుకు నేరుగా మంత్రి అయితే చప్పట్లు కొడతావా అన్నారు. నీవు ఏం మనిషికి..ఎవరైనా నా గురించి మాట్లాడితే నేను ఒప్పుకొని అంటావు, నీవు మాత్రం ఊర్లో వారందరి గురించి మాట్లాడితే చేతులు కట్టుకొని కూర్చోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి పెట్రేగిపోతుందని జాతీయ మీడియాలో పుంకాను ఫుంకాలుగా రాస్తున్నారని, దాని గురించి ప్రశ్నించలేని వ్యక్తి దేని గురించి ప్రశ్నిస్తావన్నారు. చంద్రబాబు చెప్పే స్క్రీప్ట్‌ చదివే పవన్‌ ఏం మాట్లాడుతావు. నీరు చంద్రబాబు ఇద్దరు కలిసి ఒక పెద్ద డ్రామా కంపెనీ పెట్టుకోండన్నారు. వైయస్‌ జగన్‌ గురించి నీవు మాట్లాడితే..మేం ఇంకా చాలా మాట్లాడాల్సి ఉంటుందని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పవన్‌ను హెచ్చరించారు.
 
Back to Top