పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి

ఆత్మకూరురూరల్‌(ఏఎస్‌పేట): ఏఎస్‌పేట మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాల‌ను ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి గౌతమ్‌రెడ్డి ప‌రామ‌ర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హసనాపురం గ్రామానికి చెందిన ఎన్‌హరిప్రసాద్‌రెడ్డి, బోయళ్ల భాస్కర్‌రెడ్డిల కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం హసనాపురం సెంటర్‌లో మృతుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం చిరమన గ్రామంలో విద్యుత్ షాక్‌తో మృతి చెందిన బంకా శ్రీనివాసులరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే గ్రామానికి చెందిన కాటూరు శివప్రసాద్‌రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో ఆయన ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే ఆరోగ్య ప‌రిస్థితిపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పెద్దబ్బీపురం గ్రామానికి చెందిన సూర్య‌కాంతారెడ్డి ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరపల్లి శ్రీనివాసులరెడ్డి, బోయల చెంచురెడ్డి, పద్మజారెడ్డి, నంది హజరత్‌రెడ్డి, సర్పంచ్‌లు శ్రీనివాసులరెడ్డి, రమేష్‌రెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top