మరో ప్రజా ప్రస్థానానికి ప్రజల బ్రహ్మరథం

జడ్చర్ల:

వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ చెప్పారు. కాంగ్రెస్, టీడీపీల వైఖరికి నిరసనగా శ్రీమతి షర్మిల పాదయాత్ర చేపట్టి గురువారానికి 50 రోజులు పూర్తయ్యాయి. గురువారం నాటి పాదయాత్రలో శ్రీమతి షర్మిల వెంట ఆయన కూడా పాల్గొన్నారు. ఇప్పటివరకూ ఆమె 700 కిమీ పూర్తిచేశారన్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు అమలవుతాయని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. అందరూ జగనన్న రాజన్న రాజ్యం రావాలని కోరుకుంటున్నారని కొణతాల పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top