ధనార్జనే ధ్యేయంగా కార్పొరేట్‌ కళాశాలల నిర్వహణ

అమరావతి: కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో జరిగే విద్యార్థుల ఆత్మహత్యలను ప్రభుత్వం అరికట్టాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ధనార్జనే ధ్యేయంగా శ్రీచైతన్య, నారాయణ కళాశాలలు నడుస్తున్నాయన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలపై పెట్టుకున్న ఆశలను కార్పొరేట్‌ విద్యా సంస్థలు అడియాశలు చేస్తున్నాయన్నారు. నారాయణ కళాశాలల్లో జరిగే ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Back to Top