మళ్ళీ వివరణ అవసరంలేదు

హైదరాబాద్, 13 మే 2013:

మార్చి నెలలో అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా తాము చేసిన విప్ ధిక్కారంపై అసెంబ్లీ స్పీకరుకు గతంలోనే వివరణ ఇచ్చామని టీడీపీ, కాంగ్రెస్కు చెందిన 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు తెలిపారు. కాంగ్రెస్కు చెందిన 9 మంది, టిడిపికి చెందిన ఆరుగురు తాము వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి  మద్దతుగా నిలిచామని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించామనీ, విప్ ధిక్కారంపై తక్షణం అనర్హులుగా ప్రకటించాలనీ శాసన సభాపతికి పంపిన వివరణలో పేర్కొన్న అంశాన్ని గుర్తుచేశారు. మరోసారి వివరణ ఇవ్వడమనేది కాలయాపనగా భావిస్తున్నామని అభిప్రాయపడ్డారు. మరోసారి శాసన సభాపతికి ఎదుట హాజరుకారాదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తక్షణమే తమను అనర్హులుగా ప్రకటించి శాసన సభా స్థానాలు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయాలను వారు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు  ఫ్యాక్సు ద్వారా పంపారు.

Back to Top