మళ్లీ రాజన్న రాజ్యం వస్తుంది:షర్మిల

కొంగగూడ (మహబూబ్ నగర్ జిల్లా):

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా ఉందని, మిలటరీ రాజ్యం కొనసాగుతోందని దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ఆరోపించారు. ఈ ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకోవడంలేదన్నారు. త్వరలోనే జగనన్న బయటకు వస్తారని మళ్లీ రాజన్న రాజ్యం తీసుకు వస్తారన్నారు.

'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్రలో భాగంగా శనివారం రాత్రి పాలమూరు జిల్లాలోని కొంగగూడ గ్రామానికి శ్రీమతి షర్మిల పాదయాత్ర చేరుకుంది. స్థానిక గిరిజననులు సాంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి శ్రీమతి షర్మిల మాట్లాడారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే ప్రజల కష్టాలు తీరుస్తారని హామీ ఇచ్చారు.

మహిళలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం మాట తప్పిందన్నారు. మహిళా సంఘాల నుంచి వడ్డీలు వసూలు చేసి మోసగిస్తోందన్నారు. జగనన్న సీఎం అయితే మహిళలకు తప్పకుండా వడ్డీలేని రుణాలు ఇవ్వడం జరుగుతుందని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు. అలాగే వృద్ధులకు, వితంతువులకు 700 రూపాయల పింఛన్ ఇస్తామన్నారు. జగనన్నకు మీరంతా అండగా ఉండాలని శ్రీమతి షర్మిల కోరారు.

Back to Top