మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించిన షర్మిల

మద్దుకూరు(అశ్వారావుపేట) 08 మే  2013:

  మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా దివంగత మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల  బుధవారం మద్దుకూరులో దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాల వేసి  నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహానేత డాక్టర్ వైయస్ అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు  పాదయాత్రకు తరలి వచ్చారు. జై జగన్నినాదాలతతో మద్దుకూరు మార్మోగింది. దామరచర్ల నుంచి ఆమె బుధవారం ఉదయం 142వ రోజు పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Back to Top