'మహానేత పథకాలు నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం'

కర్నూలు : నిరుపేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ఆయన మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంద‌ని వైయస్‌ఆర్‌సిపి నాయకుడు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కాంగ్రెస్ ‌నాయకులతో కలిసి కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నారని ఆయన విమర్శించారు. బిజెపి ప్రధాన కార్యదర్శి సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో 200 మంది, వంద‌ మందికి పైగా మిద్దెపల్లికి చెందిన ముస్లిం మైనార్టీలు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆదివారం డోన్‌లోని పార్టీ కార్యాలయంలో వారందరికీ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్‌ టిడిపిలకు రాష్ట్ర ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.

అధికారమే లక్ష్యంగా చంద్రబాబు గిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, ‌టిడిపి నాయకులు ఎన్ని కుయుక్తులు పన్నినా వైయస్‌ఆర్‌సిపి విజయాన్ని ఆపలేరని రాజేంద్రనాథరెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం శ్రీ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల పాదయాత్ర చేస్తున్నారని, ఇలా ఒక మహిళ సుదీర్ఘ పాదయాత్ర చేపట్టడం దేశ రాజకీయాల్లోనే ప్రథమమన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు చీకటి ఒప్పందాలు కుదుర్చుకోవడం ఆనవాయితీగా మారిందని ఆరోపించారు.

తాజా వీడియోలు

Back to Top