మహానాడు కాదు మహాపాడు

హైదరాబాద్, 29 మే 2013:

కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశ అజెండా టీడీపీ మహానాడు అజెండాకు  భిన్నంగా ఏమీ లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ఎద్దేవా చేశారు. రెండింటి లక్ష్యం వైయస్ఆర్ కాంగ్రెస్‌పై దాడి చేయడమేనని విశ్లేషించారు. బుధవారం సాయంత్రం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు వైఖరిపై గట్టు రామచంద్రరావు తీవ్రంగా మండిపడ్డారు.  ఈ నెలలో నిర్వహించిన మహానాడుకు, ఎన్టీరామారావు స్థాపించిన టీడీపీకి సంబంధం ఏమిటో ముందుగా వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. రామారావు విగ్రహం పెట్టి నిర్వహించింది మహానాడు కాదనీ, మహాపాడు అనీ ఆయన వ్యాఖ్యానించారు.

మహానాడులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం,  'చరిత్ర మరవండి.. చెప్పింది వినండి' అంటూ చంద్రబాబు నీతివాక్యాలు వల్లించారని ఎద్దేవా చేశారు. జైల్లో ఉన్న వాళ్లు తాగుతున్నారనీ, నీలి చిత్రాలు చూస్తున్నారనీ చంద్రబాబు చెప్పారన్నారు. ఈ విషయం మీకెలా తెలుసు? ఆ నీలి చిత్రాలు మీ ఇంట్లో తయారయ్యాయా? అని నిలదీశారు.  ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశావు బాబూ! అని ప్రశ్నించారు. చంద్రబాబుకు మదపిచ్చి పట్టిందని విమర్శించారు. అంత సరదాగా ఉంటే చంద్రబాబు కూడా జైలుకెళ్ళి ఆ చిత్రాలు చూడాలని సలహా ఇచ్చారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో కాదు.. పిచ్చాస్పత్రిలో ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలతో ఆయన ప్రజాస్వామ్యాన్నే కాక.. మానవత్వాన్నే ఖూనీ చేశారన్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళడానికి తాను కారణమని శ్రీమతి విజయమ్మ అంటున్నారనీ, అదెలాగనీ చంద్రబాబు ప్రశ్నించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.
తమ పార్టీ న్యాయస్థానాలను ఎప్పుడూ విమర్శించలేదని గట్టు రామచంద్రరావు స్పష్టం చేశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిలాంటి పరిస్థితే తనకు వచ్చుంటే చంద్రబాబు ఇతర దేశాలకు పారిపోయి ఉండేవాడన్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే ఆయన  కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారనీ, ఇది అనేక సందర్భాలలో రుజువైందనీ చెప్పారు.

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుపై ఉన్న ఆరోపణలకు సంబంధించి విచారణ జరిగితే ఆయన జీవితాంతం జైలులో ఉంటారని తెలిపారు. బాబు తనపై కేసులు నమోదైనప్పుడు ఒక రకంగా, మరొకరి విషయంలో మరోలా మాట్లాడతారని విమర్శించారు. బాబు మాటలకు, సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ మాటలకు తేడా ఏమన్నా ఉందా? అని అడిగారు. వ్యవస్థను మేనేజ్ చేయగల సత్తా చంద్రబాబుకు ఉందని బ్రిటిష్ సంస్థ గతంలోనే చెప్పిందని గుర్తు చేశారు. తమకు కోర్టులపై నమ్మకం ఉన్నందునే విచారణను ధైర్యంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఇవే కేసులు చంద్రబాబుపై ఉంటే విదేశాలకు పారిపోయి ఉండేవారన్నారు. ఇలాగే మాట్లాడితే తమ దేశంలో అయితే  పిచ్చాస్పత్రిలో వేస్తారని జేమ్సు మేనర్  బ్రిటన్ దేశ వాసి చెప్పారు. అన్నీ అబద్ధాలు.. ఆంధ్ర గోబెల్సులా మాట్లాడుతున్నారనీ, వ్యవస్థల్ని మేనేజ్ చేయకపోయిఉంటే  నువ్వెక్కడ ఉండేవాడివని అడిగారు. చంద్రబాబు అధికారంలో ఉండగా గుడికి గానీ, బడికి గానీ, విద్యార్థికి గానీ చుక్క చమురు ఇవ్వలేదన్నారు. అలాంటి బాబు తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఓ మాజీ న్యాయమూర్తి ఊరిలోని గుడికి రూ. పది లక్షలు ఇచ్చారని గట్టు వెల్లడించారు.  ఇలా ఎందుకిచ్చారో ఆలోచిస్తే చంద్రబాబు వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేస్తారో అర్థమవుతుందన్నారు.

సీబీఐ జేడీకి భిన్నంగా చంద్రబాబు ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. ఎల్లో మీడియాలో అవే మాటలు  ప్రచురితమైన విషయాన్ని పరిశీలించిన ఎవరికైనా .. దీనిని మేనేజ్ చేయడమేనని అనిపించక మానదన్నారు. చంద్రబాబుపై విచారణకు సిబ్బంది లేరని చెప్పిన సీబీఐ శ్రీ జగన్‌పై విచారణకు రెండు వారాలు చాలన్న అంశాన్ని ఎవరూ మరువ లేదన్నారు.

సీబీఐని అడ్డంపెట్టుకుని తాబేదారులతో వేషాలేయించడం.. ఆ ప్రకారం చేయించడం ఎవరికి తెలీదనుకుంటున్నారన్నారు.  శ్రీ జగన్మోహన్ రెడ్డిగారిని జైలు ఉంచాలనే కుట్ర ఆయనదేననీ, శ్రీమతి విజయమ్మ  అన్న మాటల్లో తప్పు లేదనీ స్పష్టంచేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణకు చంద్రబాబు సిద్ధపడుంటే తెలిసేదన్నారు. ఇక్కడ సహజ న్యాయం పాటించి ఉంటే బాగుండేదన్నారు. తన హయాంలో కోర్టుల్ని అవమాన పరిచి మహానాడులో చంద్రబాబు దానిని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

సీబీఐ తరఫున వకల్తా తీసుకుని మాట్లాడాలని గట్టు కోరారు. ఈ రకంగా మాట్లాడుతున్న చంద్రబాబు నాలుక కోయాలనిపిస్తోందని తీవ్రంగా వ్యాఖ్యానించారు.  చంద్రబాబుని కాపీ కొట్టేది కిరణ్ ఒక్కరేనన్నారు. మీ పాలన గురించి మహానాడులో ఎందుకు  చెప్పలేదని ఆయన చంద్రబాబును నిలదీశారు. వీటిగురించి మాట్లాడడం మాని తనలో మార్పు వచ్చిందనీ చెబుతూ వైయస్ఆర్, ఎన్టీఆర్ పథకాలను పెడతానంటున్నావనీ ఎద్దేవా చేశారు. తనలో ఏం మార్పొచ్చిందీ తెలియజెప్పాలని గట్టు డిమాండ్ చేశారు.

అనంతపురం జిల్లాలో వజ్రాల వేట కోసం నాలుగున్నర లక్షల ఎకరాలను చంద్రబాబు కేటాయించడం సరైన నిర్ణయమేనంటున్నారనీ, ఏపీఐఐసీ ద్వారా దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ భూములు కేటాయిస్తే తప్పంటున్నారనీ ఇదెక్కడి న్యాయమనీ గట్టు రామచంద్రరావు అడిగారు.

తాజా ఫోటోలు

Back to Top