లండన్) స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని, లండన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరిట 300 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహానేత వైఎస్సార్ చేసిన సేవల్ని స్మరించుకొన్నారు. వైఎస్సార్‌సీపీ యూకే మరియు ఐరోపా విభాగం సభ్యులు సందీప్ రెడ్డి వంగల, శివకుమార్ రెడ్డి చింతమ్, డా. ప్రదీప్ కుమార్ చింతా, అబ్బయ్య చౌదరి కొఠారి, సతీష్ వనహారామ్, వాసుదేవ రెడ్డి మేరెడ్డి, భగవాన్ రెడ్డి, కోటిరెడ్డి కళ్లం, పీసీరావు, సురేష్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, ప్రదీప్ కుమార్‌రెడ్డి కంటి, రవి మేచెర్ల, భాస్కర్ రెడ్డి మలపాటి, సునీల్ రెడ్డి చవ్వా ఇతర క్రియా శీల కార్యకర్తలు పాల్గొన్నారు.వైఎస్ జగన్ నాయకత్వంలో పార్టీ కోసం మరింతగా పాటు పడతామని ఈ సందర్భంగా నాయకులు అన్నారు. ఈ కార్యక్రమ ఏర్పాటుపై ఎన్ ఆర్ ఐ వర్గాల్లో హర్షం వ్యక్తం అయింది.