కుమ్మక్కు రాజకీయం మానుకో బాబూ: సామినేని

విజయవాడ, 12 నవంబర్‌ 2012: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కుమ్మక్కు రాజయాలు మానుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు సామినేని ఉదయభాను హితవు పలికారు. ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం మైనార్టీలో పడిందన్నారు. మైనార్టీలో పడిపోయిన ఈ అసమర్థ ప్రభుత్వంపై ఇప్పుడైనా చంద్రబాబు అవిశ్వాసం పెట్టాలని ఆయన సోమవారంనాడు విజయవాడలో డిమాండ్‌ చేశారు. శాసనసభ శీతాకాల సమావేశాలు ఏర్పాటు చేసి, సభలో తన బలాన్ని అధికార కాంగ్రెస్‌ పార్టీ నిరూపించుకోవాలని ఉదయ భాను సవాల్ ‌చేశారు.
Back to Top