కొవ్వూరు నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం

కొవ్వూరు (ప.గో.జిల్లా),

4 జూన్‌ 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 169వ రోజు మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోని మెరకవీధి నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి బస్టాండ్ సెంట‌ర్, విజయవిహా‌ర్,‌ సీతారామరాజు చౌక్‌, ఆంధ్రా సుగర్సు‌ వరకూ పాదయాత్ర చేస్తారు. అక్కడ శ్రీమతి షర్మిల మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారని పార్టీ కార్యక్రమాల కమిటీ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్‌ తెల్లం బాలరాజు తెలిపారు. భోజన విరామం వరకూ ఆమె మొత్తం 6 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు.

అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల పొడవు ఉన్న కొవ్వూరు బ్రిడ్జి మీదుగా షర్మిల యాత్ర సాగుతుందని రఘురాం, బాలరాజు చెప్పారు. కొవ్వూరు వంతెన మీదుగా వెళ్ళడంతో శ్రీమతి షర్మిల పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర పూర్తవుతుంది.

‌కొవ్వూరు రోడ్ క‌మ్ రైలు వంతెన మీదుగా పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి 2.7 కిలోమీటర్లు నడిచి రాజమండ్రిలోని ‌కోటిపల్లి బస్టాండ్ సెంట‌ర్‌లో జరిగే బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు. బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ఆమె మెయిన్‌ రోడ్‌, అప్సర థియేటర్‌ సెంటర్‌ మీదుగా సెయింట్‌‌ పాల్ చర్చి కాంపౌండ్‌ వరకూ నడుస్తారు. మంగళవారం రాత్రికి శ్రీమతి షర్మిల సెయింట్‌ పాల్‌ చర్చి కాంపౌండ్‌లోనే బస చేస్తారని రఘురాం, బాలరాజు వివరించారు. మంగళవారంనాడు శ్రీమతి షర్మిల పాదయాత్ర మొత్తం 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుందని వారు తెలిపారు.

Back to Top