కొనసాగుతున్న చీకటి ఒప్పందం: అంబటి

సత్తెనపల్లి:

కాంగ్రెస్, టీడీపీల మధ్య చీకటి ఒప్పందం కొనసాగుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. తాలూకా సెంటర్‌లో  జగన్ కోసం జన సంతకం పేరుతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని వేధించడమే లక్ష్యంగా ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు. ప్రజా బలాన్ని ఎదుర్కోలేక శ్రీ జగన్మోహన్‌ రెడ్డిని అన్యాయంగా జైలులో పెట్టారన్నారు. బెయిల్ కూడా రాకుండా ప్రభుత్వం అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మండిపడ్డారు. అధికార పార్టీ నీచ రాజకీయాలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ముందుగా ఆయన సంతకం చేసి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంతకాలు చేసేందుకు ప్రజలు క్యూ కట్టారు. కార్యక్రమంలో పార్టీ మైనార్టీ విభాగం జిల్లా కన్వీనర్ సయ్యద్ మహబూబ్, సత్తెనపల్లి టౌన్, సత్తెనపల్లి రూరల్, ముప్పాళ్ళ, రాజుపాలెం మండలం కన్వీనర్లు గార్లపాటి ప్రభాకర్, మదమంచి రాంబాబు, రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డి, తోట ప్రభాకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top