కాజీపేటలో విజయమ్మకు ఘనస్వాగతం

వరంగల్, 21 మే 2013:

  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మకు వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్లో పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు సందర్శనకు విజయమ్మ మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఏపీ ఎక్సుప్రెస్ లో బయల్దేరారు.  ఆమె11.15 గంటలకు కాగజ్‌నగర్ పట్టణానికి చేరుకుంటారు. రోడ్డు మార్గం గుండా కౌటాల మండలం తుమ్మిడిహెట్టికి వెళ్తారు. మార్గమధ్యంలోని సిర్పూర్(టి)లో వైయస్ఆర్ కాంగ్రెస్ జెండా ఆవిష్కరిస్తారు. టొంకిని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.  కౌటాల మండలం ముత్తం పేట గ్రామంలో వైయస్ఆర్ కాంగ్రెస్ జెండా ఆవిష్కరిస్తారు. కౌటాల మండల కేంద్రంలోకూడా జెండావిష్కరణ చేస్తారు.

తుమ్మిడిహెట్టిలోని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజె క్టు శిలాఫలకానికి క్షీరాభిషేకం అనంతరం అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తా రు. ప్రాణహిత నదిలో పడవలో ప్రయాణించి పరిశీలిస్తారు. కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్పీఎం గ్రౌండ్‌లో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే బహిరంగసభలో ప్రసంగించనున్నారు. అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

తొలుత శ్రీమతి వైయస్ విజయమ్మ హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసం నుంచి మంగళవారం ఉదయం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు బయల్దేరారు. ప్రాణహిత-చేవెళ్ళను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తూ శ్రీమతి విజయమ్మ ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించనున్నారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల పథకం అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆమె నిలదీయనున్నారు. ప్రాజెక్టు కోసం దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి వేసిన శిలాఫలకాలకు ఆమె క్షీరాభిషేకం చేయనున్నారు.

Back to Top