జలయజ్ఞంపై చర్చకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పట్టు

హైదరాబాద్, 10 జూన్‌ 2013:

ప్రాణహిత - చేవెళ్ల, పోలవరం ప్రాజెక్టులకు జాతీయ హోదాకల్పించడం, జలయజ్ఞం అమలు, మంచినీటి సమస్య, రైతాంగ సమస్యలు వంటి పలు అంశాలపై శాసనసభలో చర్చించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు పట్టుబట్టారు. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ మలి విడత సమావేశాలు ఈ నెల 21 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వహించిన బిఎసి సమావేశంలో బెల్టు షాపుల ఎత్తివేత, ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి పెంపు, అంగన్‌వాడి సమస్యలు, సబ్‌ప్లాన్ సరిగా అమలు కాకపోవడం, ఆరోగ్యశ్రీ సమస్యలపై చర్చించాలని వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. స‌ర్ ఛార్జీల పేరిట విద్యు‌త్ ఛార్జీల పెంపు, కోతలపై ప్రధానంగా చర్చించారు. బంగారు తల్లి‌ తదితర మరో ఐదారు బిల్లులను ఈ శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

Back to Top