జగన్‌తో సత్యారావు, వెంకటేశ్వర్లు భేటి

హైదరాబాద్, 29 జనవరి 2013: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ ‌నాయకుడు, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు మంగళవారంనాడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని కలిశారు. విశాఖపట్నం జిల్లా చోడవరానికి చెందిన సత్యారావు కాంగ్రెస్‌ పార్టీలో ప్రముఖ పాత్ర పోషించారు. చంచల్‌గూడ జైలులో ఉన్న శ్రీ జగన్‌తో భేటీ అనంతరం సత్యారావు మీడియాతో మాట్లాడారు. శ్రీ జగన్‌ను తాను మర్యాద పూర్వకంగానే కలిసినట్లు చెప్పారు. శ్రీ జగన్‌తో తాను భేటి కావడానికి పెద్దగా ప్రాధాన్యత లేదని ఆయన చెప్పారు.

కాగా,‌ వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో తాను చేరుతున్నట్టు టిడిపికి చెందిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రకటించారు. గతంలో ఆయన ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు.‌ శ్రీ జగన్‌ను మంగళవారం కలిసిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్, టిడిపిలు చేస్తున్న కుమ్మక్కులు, కుట్రలను రాష్ట్ర ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారని, తగిన సమయంలో వాటికి సరైన గుణపాఠం చెబుతారని వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
Back to Top