వైఎస్ జగన్ మొద‌టి ట్వీట్‌


హైదరాబాద్: నిరంత‌రం జ‌నం గురించి ఆలోచించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ట్విట‌ర్ లో అడుగు పెట్టారు. ట్విట‌ర్ సామాజిక మాధ్య‌మం నుంచి చేసిన మొద‌టి ట్వీట్ ... ప్ర‌జ‌ల స్థితి గ‌తుల గురించే చేశారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేక విధానలపై ఆయన  ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. రైతు హత్యలకు ఎవరు కారకులు..? మోసం చేసిన చంద్రబాబా? ...పట్టించుకోని అతని ప్రభుత్వమా? గట్టిగా నిలదీయని మన సమాజమా?  అని వైఎస్ జగన్ ట్విట్టర్లో ప్రశ్నించారు.  రైతు లోకం ఎదుర్కొంటున్న క‌ష్ట న‌ష్టాల‌పై ఆవేద‌న చెందుతూ ఆయ‌న రైతు భ‌రోసా యాత్ర చేప‌ట్టిన విష‌యం తెలిసిన‌దే. రైతుల్ని ప‌ల‌క‌రిస్తూ, ప‌రామ‌ర్శిస్తూ .. ఆవేద‌న తో రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌పై స్పందించి ఆయ‌న ఈ ట్వీట్ చేశారు.

Back to Top