జగన్ ముఖ్యమంత్రి కావడమే ప్రతి ఒక్కరి లక్ష్యం

 శ్రీకాకుళం:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహనరెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పార్టీ నేతలు, కార్యకర్తలు పనిచేయాలని నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు.  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ప్రతి కార్యకర్త ఆకాంక్ష కావాలని నరసన్నపేటలో ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన అన్నారు. అందరూ కలిపికట్టుగా పాటుపడి పార్టీని మరింత పటిష్టం చేయడానికి కృషి చేయాలన్నారు. ఈ ఏడాది పార్టీకి ఎంతో ముఖ్యమన్న విషయం అంతా గుర్తించాలని సూచించారు. పదవులు, టిక్కెట్లు ఆశించకుండా కష్టించి పనిచేసిన వారిని పూర్తిస్థాయిలో ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సహకార ఎన్నికల్లో సత్తా చూపిస్తాం
సహకార సంస్థలకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో సత్తా చాటుతామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కృష్ణదాస్ అన్నారు. ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, దాన్ని దీటుగా ఎదుర్కొంటామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఏంచేసినా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం విద్యుత్ చార్జీలను భారీగా పెంచి సామాన్యుడి బతుకును భారం చేసిందని అన్నా రు. పెంచిన చార్జీలను తగ్గించేవరకూ పోరాడతామన్నారు.

Back to Top