జగన్‌కు బెయిల్ రాకుండా కుట్ర: ఆర్కే

గుంటూరు:

కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని  గుంటూరు, కృష్ణా జిల్లాల కో-ఆర్డినేటర్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) విమర్శించారు. కుమ్మక్కు రాజకీయాలతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైసయస్ జగన్మోహన్‌ రెడ్డికి బెయిల్ రాకుండా కుట్ర పన్నిందన్నారు. సీబీఐ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారిందనీ, అధికార పార్టీ ఆకృత్యాలకు మద్దతు పలుకుతూ ఘోర తప్పిదం చేస్తోందనీ చెప్పారు. కాంగ్రెస్, టీడీపీలు సీబీఐతో కుమ్మక్కై న్యాయస్థానాన్నీ సీబీఐ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి  బయటకొస్తే ఆయన ప్రభంజనాన్ని తట్టుకోలేమని గ్రహించి రెండు పార్టీలు కలసి బెయిల్ రాకుండా కుటిలయత్నాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ప్రజాకోర్టులో శ్రీ జగన్ నిర్ధోషనీ, ఆయనను విడుదల చేయాలనీ కోరుతూ కోట్లాది మంది సంతకాలు పెట్టి మద్దతు పలకడమే దీనికి నిదర్శనమన్నారు. ఈ కుట్రలు, కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారనీ, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైయస్ఆర్ కాంగ్రెస్ అఖండ మెజార్టీతో గెలిపించి, శ్రీ జగన్‌ను సీఎం చేయడం ఖాయమనీ ఆర్కే తెలిపారు.

Back to Top