జగన్ క్షేమం కోరుతూ పాదయాత్ర

నర్సీపట్నం: వైయస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి క్షేమం కోరుతూ పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు పార్టీ నాయకుడు పెట్ల ఉమాశంకర్ గణేశ్ పేర్కొన్నారు. స్థానిక కృష్ణా ప్యాలస్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్‌కు ఆదరణ చూసి ఓర్వలేకనే జగన్‌ను జైలుపాలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిం దని ఆరోపించారు. సీబీఐ ఆయన్ను పలుమార్లు విచారించినా ఎటువంటి సాక్షాధారాలు చూపలేకపోయిం దని విమర్శించారు. ఆయన నాలుగు నెలలు గా జైల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల ఐదున సుప్రీంకోర్టులో ఆయన బెయిల్ పిటీషన్‌పై విచారణ జరగనుందన్నారు. ఆయన విడుదలను కాంక్షిస్తూ గురువారం నర్సీపట్నం, మాకవరపాలెం మండలాల్లో పాదయాత్ర చేపడుతున్నట్టు వివరించా రు. ఆ రోజు ఉదయం స్థానిక కనకదుర్గ ఆల యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. అనంతరం పెదబొడ్డేపల్లిలోని మసీదు, కొండల అగ్రహారంలోని ఇమ్మానుయేలు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ పాల్గొని విజయవంతం చేయాలని గణేష్ కోరారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రుత్తల సర్వేశ్వర్రావు మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడాలేని విధంగా పాదయాత్ర చేపట్టడం అనందించదగ్గ విషయమన్నారు. పార్టీ నాయకులు మీసాల సత్యనారాయణ మాట్లాడుతూ జగన్ క్షేమంగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు మూకల బాలకృష్ణ, ఎంపీటీసీ మాజీ సభ్యులు రుత్తల సత్యనారాయణ, రెడ్డి కుమార్, కాళ్ల ఈశ్వర్రావు, మాజీ సర్పంచ్ సుర్ల సత్యనారాయణ, తాండవ డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు వెలగల వెంకటరమణ, కొల్లాన నాని, లోకవరపు శ్రీను, ఆరుగుళ్ల రాజుబాబు, రుత్తల సత్యనారాయణ, శెట్టి శేఖర్, లవుడు రమేష్, శెట్టి నర్సింగరావు, సుకల గోవింద, సుకల నూకరాజు, పెట్ల అచ్చియ్యనాయుడు, సుకల సన్యాసినాయుడు, ఎం.ఆర్.కె. నాయుడు, దనిమిరెడ్డి ప్రసాద్, ఇటంశెట్టి శ్రీనువాసరావు పాల్గొన్నారు.

Back to Top