'జగన్ కోసం స్వచ్ఛందంగా జనం సంతకాలు'


శ్రీకాకుళం:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ చేపట్టిన 'జగన్ కోసం... జనం సంతకం' కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందగా పాల్గొంటున్నారని  పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన సద్మప్రియ అన్నారు. సంతకాల సేకరణ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ రెండు లక్షల సంతకాలు సేకరించామని, త్వరలో ఐదు లక్షల సంతకాల సేకరణ పూర్తి చేస్తామన్నారు. శ్రీ జగన్మోహనరెడ్డి విషయంలో కాంగ్రెస్, టీడీపీలు సీబీఐని అడ్డం పెట్టుకుని చేస్తున్న కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.

     రానున్న సహకార ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధించడం ఖాయమని పద్మప్రియ ధీమా వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి రైతుల కోసం ఎంతో చేశారన్నారు. ఆయనపై ఉన్న అభిమానంతో ప్రతి రైతు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారన్నారు.

Back to Top