మానససరోవరం యాత్రికులపై వైయస్‌ జగన్‌ ఆందోళన

అమరావతి: మానస సరోవరం వెళ్లిన రాష్ట్రానికి చెందిన యాత్రికులు , తుఫాన్ లో  చిక్కుకుపోయిన ఉదంతంపై వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆందోళన వ్యక్తం చేశారు. వీరిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకుని వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 
మానస సరోవరం యాత్రకు బయల్దేరి వెళ్లిన  అనేక  ఆంధ్రులు తుఫానులో చిక్కుకున్నారు. వీరిలో గత 30వ తేదీ చైనా, నేపాల్‌ సరిహద్దులోని హిల్సా ప్రాంతం వద్ద  ఆగిపోవాల్సి వచ్చింది. ఇలా చిక్కుకున్న యాత్రికుల పరిస్థితులపై   వైయస్‌  జగన్‌మోహన్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వారిని క్షేమంగా తిరిగి తీసుకుని వచ్చేలా చర్యలు తీసుకోవడంతోపాటు, సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి కావాల్సిన వైద్య సదుపాయాలు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను  కోరారు.
Back to Top