ప్రజలు కష్టాలు తెలిసిన జననేతే సీఎం కావాలి

పశ్చిమ గోదావరి: ప్రజల కష్టాలు కళ్లారా చూసిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని రైతులు, యువత అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అన్నారు. ప్రజల కష్టాలు కడతేర్చడం కోసం వైయస్‌ జగన్‌ మండుటెండలో పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. చెరుకువాడ శ్రీరంగనాథరాజు వైయస్‌ఆర్‌ సీపీలో చేరడం అభినందనీయమన్నారు. రంగనాథరాజు చేరికతో జిల్లాలో పార్టీ 15 స్థానాల్లో విజయం సాధిస్తుందని శేషుబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసి ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రాకుండా చేయాలన్నారు. 
Back to Top