తెల్ల కాగితాల్లో కనిపించేది అభివృద్ధా..?


బాబు పాలనలో పోలవరం సినిమా.. అమరావతి గ్రాఫిక్స్‌..
 చంద్రబాబే దళారీలకు కెప్టెన్‌
రైతులపై కేసులు పెట్టి జైల్లో పెట్టించిన ఘనత టీడీపీదే..
ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తెస్తాం
మెళియాపుట్టి బహిరంగ సభలో వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి


 శ్రీకాకుళంః  కరువు, తుపాన్లు  ఇసుక దోపిడీ, నిరుద్యోగం..ఈ నాలుగున్నరేళ్లలో చంద్రబాబు ఇచ్చింది ఇదేనని  ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి గ్రామంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి సమాజంలో కనబడాలని తెల్లకాగితాల్లో కనిపించేది అభివృద్ధి ఎలా అవుతుందని ప్రశ్నించారు. నాలుగున్నర సంవత్సరాల చంద్రబాబు పాలన  చూశాం. పాతపట్నం నియోజకవర్గంలో  అడుగుపెట్టినప్పుడు జిల్లా ప్రజలు నన్ను అడిగిన మాట. 2014లో ఇదే పెద్దమనిషి చంద్రబాబు 10 స్థానాలకు 7 స్థానాలు ఇచ్చామన్నా.. ఇది చాలదన్నట్లు సంతలో పశువులను కొన్నట్లుగా మా జిల్లా నుంచి ఒక వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేను కొనుగోలు చేశాడన్నా. జిల్లా నుంచి 8 స్థానాలు తన చెంతనే పెట్టుకుని మా నియోజకవర్గానికి ఏం చేశాడన్నా.. మా జిల్లాకు  ఏం చేశాడన్నా అని ప్రజలు అడుగుతున్నారు. ఇదే నియోజకవర్గానికి  సంబంధించి ఫ్యాన్‌ గుర్తుపై గెలిచి ఫిరాయించి సైకిల్‌ ఎక్కాడు ఇక్కడ ఎమ్మెల్యే. పార్టీ మారిన తర్వాత ఎమ్మెల్యే ఏమయినా చేశాడా అని ప్రజలను అడిగా.. అన్నా చేశాడన్నా ఈ నియోజకవర్గంలో ఇసుక ర్యాంపుల నుంచి ఇసుకను మాత్రం బాగా దొంగతనం చేశాడన్నా.  ఇది సరిపోదు అన్నట్లు వంశ«ధార నిర్వాసితులకు దక్కవలసిన పరిహారాన్ని కూడా బోగస్‌ పేర్లుతో కొట్టేశాడన్నా అని అన్నారు. ఇదే నియోజకవర్గంలో ఉన్న  జిల్లాకు వరప్రదాయని వంశధార ప్రాజెక్టు.

గతంలో 9 సంవత్సరాల నుంచి  ఈ ప్రాజెక్టు కట్టాలి. రైతులను మేలు చేయాలనే ఆలోచన ఏనాడు చంద్రబాబు చేయలేదు. ఆ తర్వాత దివంగత నేత వైయస్‌ఆర్‌ సీఎం అయ్యారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా పట్టించుకోకుండా వదిలేసిన  ప్రాజెక్టును ఒడిశాతో వివాదం ఉన్న కూడా ముందుడుగు వేశారు. సైడ్‌ వ్యూయర్‌ కట్టి వంశధార నీటిని తరలించడానికి కాల్వలు తవ్వించి హిరామండలం, సింగిడి, మాదాపురం రిజర్వాయర్‌ పనులను 2005లో వైయస్‌ఆర్‌ మొదలు పెట్టారు. దాదాపు 930 కోట్ల విలువ చేసే ప్రాజక్టులో  700 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టించిన ఘనత ఆ దివంగత నేతది. నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ తర్వాత ప్రభుత్వం మళ్లీ 175 కోట్లు రూపాయలు ఖర్చుచేసింది.  చంద్రబాబు ప్రభుత్వం వచ్చేసరికి కేవలం 55 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తే ఈ ప్రాజెక్టు పూర్తయ్యేది.. అటువంటింది చంద్రబాబు 55 కోట్లు ఖర్చుచేస్తే పూర్తయ్యే ప్రాజెక్టు అంచనాలను పెంచి 476కు కోట్లు పెంచాడన్నా చంద్రబాబు అన్నారు. ఈ ప్రాజెక్టుకు కాంట్రాక్టర్‌గా తన సొంతమనిషి, తన బీనామీ సీఎం రమేష్‌ను తెచ్చుకుని కట్టబెట్టడన్నా ఈ పెద్ద మనిషి అని అన్నారు.ఈ ప్రాజెక్టులో పురోగతి ఉందా అని చూస్తే  జిల్లాలో 2లక్షల 55వేల సాగునీరు అందించే ప్రాజెక్టు నత్తనడకన పనులు సాగుతున్నాయి.ఈ మధ్య కాలంలోనే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిందన్నా.నేరేడు వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ఓకే చెప్పిందన్నా..ఒకే చెప్పినా కూడా చంద్రబాబు ఒక రూపాయి కూడా విదల్చలేదన్నా అని ఇక్కడ ప్రజలు చెబుతున్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేరేడు బ్యారేజీ నిర్మించడంతో పాటు అన్ని పనులు పూర్తిచేస్తానని హామీ ఇస్తున్నాను. 

వంశధార ప్రాజెక్టు నిర్వాసితులు నన్ను కలిశారు. ఇదే నిర్వాసితులు అన్యాయం జరుగుతుందని ధర్నాలు చేస్తుంటే అప్పట్లో హిరా మండలానికి వచ్చాను. మద్దతు తెలిపాను. ఆ రోజు అన్న మాటలు బాగా గుర్తుకువున్నాయి. అనాటి నుంచి నేటి వరుకు నిర్వాసితులు ప్లకార్డులు పట్టుకుని బాధపడుతున్నారు.దాదాపు 22 గ్రామాలకు చెందిన నిర్వాసితుల పరిస్థితి. వీళ్లంతా కూడా ధర్నాలు చేస్తే 200 మంది రైతులకు మీద ప్రభుత్వం కేసులు పెట్టింది. 37 మంది రైతులను 40 రోజులు జైల్లో పడేసింది. ఇంత దారుణంగా టీడీపీ ప్రభుత్వం  క్షక్షసాధింపు చర్యలకు దిగింది. వంశధార నిర్మాణం పూర్తిచేయడమే  కాదు. భూములను కోల్పోయిన నిర్వాసితులకు తోడుగా ఉంటా. పెట్టిన కేసులు ఎత్తివేస్తా. 2013 భూసేకరణ చట్టం ప్రకారం మిగిలిన పరిహారం వచ్చేలా చేస్తా. పేదల నుంచి డి పట్టా భూములను బలవంతంగా ప్రభుత్వం లాక్కుంది. ప్రతిపేదవానికి మిగిలినవారికి సమాన న్యాయం చేస్తా. ఈ నియోజకవర్గానికి అంతో ఇంతో మేలు జరిగే ప్రాజెక్టు ఉందంటే మహేంద్ర తనయ రిజర్వాయర్‌. దాదాపు 108 గ్రామాల్లో  24,600 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి మహింద్రతనయ ప్రాజెక్టుకు దివంగత నేత వైయస్‌ఆర్‌ హయాంలో 127 కోట్లు రూపాయలు మంజూరు చేశారు.  ఆ ప్రాజెక్టు పనులు 40 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ ప్రాజెక్టు అంచనాలు మాత్రం ఏకంగా చంద్రబాబు 470 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచేసి తన బినామీలకు మేలు చేయడానికి చంద్రబాబు చేస్తున్నారు. పనులు కూడా చేయించకుండా ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉంది. 

 నియోజకవర్గంలో ఎక్కడ చూసినా తాగునీటి సమస్య కనిపిస్తోంది. పాతపట్నంలో నాన్నగారి హయాంలో చేపట్టిన  మంచినీటి పథకం కూడా సరిగా నిర్వహించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. 15 గ్రామాల్లో 30 వేల మందికి తాగునీరు అందడం లేదన్నా అని ప్రజలు అంటున్నారు.మెళియాపుట్టి మండలంలో చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని దారి పోడవునా ప్రజలు చెబుతున్నారు. అడిగేవారు.పట్టించుకునేవారు లేరు. ముఖ్యమంత్రి ఉన్న  చంద్రబాబు  సిగ్గుతో తలవంచుకోవాలి. ఇదే మెళియాపుట్టిలో ఉన్న  సామాన్య ఆసుప్రతిలో ఘోరంగా ఉంది. డాక్టర్ల కొరత ఉంది. పాతపట్నంలో వైద్యానికి పోతే వైద్యం అందని పరిస్థితి ఆసుప్రతిలో ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం నలుగురే వైద్యులు ఉన్నారు. కొత్తూరు హెల్త్‌ కమ్యూనిటీ సెంటర్‌లో అయితే కనీసం బెడ్‌లు కూడా లేవన్నా అని ప్రజలు చెబుతున్నారు. ఓపికి మాత్రమే పరిమితం చేస్తున్నారు. నియోజకవర్గంలో 108 అంబులెన్స్‌లు 3 ఉంటే 2 రిపేర్లలో ఉన్నాయి. నాన్నగారు వైయస్‌ఆర్‌ హయాంలో ఇదే నియోజకవర్గంలో 28వేల ఇళ్లు కట్టించారన్నా..చంద్రబాబు హయాంలో ఊరికి నాలుగు,ఐదు ఇళ్లు కూడా ఇవ్వలేదన్నా అని ప్రజలు చెబుతున్నారు. మంజూరు చేసే ఇళ్లుకు కూడా జన్మభూమి కమిటీలు లంచాలు అడుగుతున్నారన్నా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఒకటి జరుగుతుందన్నా. మా నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పుణ్యం వల్లన అక్షరాల 20 గవర్నమెంట్‌ స్కూల్‌ను మూసించివేశాడన్నా అని చెప్పారు. పాతపట్నం 7, హిరా మండలంలో 2,కొత్తూరులో 9,మెళియాపుట్టిలో కూడా 2 స్కూళ్లు మూసివేసిన ఘనత ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడుది అన్నా అని చెప్పారు.

తిత్లీ తుపాను బాధితులకు నేనే బ్రహ్మండంగా చేశాను అని చంద్రబాబు పబ్లిసిటీ ఇచ్చుకుంటారు.చంద్రబాబు బాగా చేశారా అని అడుగుతున్నా..ఎంత గొప్పగా చేశారంటే ఆర్టీసీబస్సులపై ఫోటోలు పెట్టి, విశాఖ,విజయవాడలలో ప్లెక్సీల్లో అవే ఫోటోలు పెట్టి జనం జేజేలు పలుకుతున్నారని  చెప్పుకుంటాడు.వర్షాలు కారణంగా వంశధార నది ఉప్పొంగి కొత్తూరు, హిరా మండలంలో పంటలు నీటమునిగాయి. మహేంద్ర తనయ వల్లన పంటలు దెబ్బతీన్నాయి. అయినా కూడా తుపాన్‌ నష్టంగా ప్రభుత్వం చూడలేదు. రైతులు ధర్నా చేస్తే వారిపై కేసులు పెట్టిన ఘనత ఈ టీడీపీ ప్రభుత్వానిది. ఆ రైతులను అరెస్ట్‌ చేయడం పట్ల న్యాయమూర్తి చీవాట్లు పెట్టారు. ఇదే నియోజకవర్గంలో 5 మండలాల్లో 75వేల ఎకరాలకు పంటనష్టం జరిగితే దాంట్లో 53 వేల ఎకరాలను గుర్తించారు. మిగతా 23వేల ఎకరాలను గుర్తించమని  మొహమాటం లేకుండా ఈ ప్రభుత్వం చెబుతోంది.గుర్తించి 53వేల ఎకరాలలో కూడా వేల ఎకరాలకు పరిహారం ఇవ్వలేదు.రెండో జాబితా కోసం రైతులు,పేదలు ఎదురుచూస్తున్న పరిస్థితి.గిరిజన గ్రామాల్లో 5వేల ఇళ్లు పై కప్పులు తుపాన్‌ గాలికి ఎగిరిపోతే ఒకరికి టార్పాలిన్‌ బట్ట కూడా ఇవ్వలేదు. రేకులు కూడా ఇవ్వలేదు.చంద్రబాబు ఫోటో మాత్రం ఎక్కడబడితే అక్కడ తుపాను జయించినట్లుగా పెట్టేస్తారు.నెలరోజులు దాకా నలభై గ్రామాలకు  విద్యుత్,మంచినీరు కూడా ఇవ్వలేదన్నా అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో తుపాను నష్టం 3,435 కోట్లు అని కేంద్రం ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాశాడు.చంద్రబాబుకు 3,435 కోట్ల రూపాయాలలో ఎంత ఇచ్చావు  ప్రజలకు అని అడుగుతున్నా.. ఈ పెద్దమనిషి ఇచ్చింది ఎంత అంటే అందుల్లో కేవలం 500 కోట్లు మాత్రమే విదిల్చి గొప్పగా ప్రచారం చేసుకుంటారు.బాధితులకు న్యాయం చేశానని ఫోజులు కొడతాడు.బాధితులకు ఇచ్చిన చెక్కులు కూడా చెల్లకుండా పోయాయని రైతులు చెబుతున్నారు. చెక్కులు తీసుకెళ్తే  బ్యాంకులు చెత్తబుట్టలో వేస్తున్నాయి. తుపాను జయించాను.సముద్రాన్ని కంట్రోల్‌ చేసేశాను. దేవుడిపై విజయం సాధించాను అని చెప్పడానికి చంద్రబాబు అర్హుడేనా అని ప్రశ్నిస్తున్నాను.3,435 కోట్ల రూపాయలలో చంద్రబాబు ఇచ్చి మిగిలింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తానని హామీ ఇస్తున్నా..రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందంటే రైతులకు,అక్కాచెల్లెమ్మలకుకు కూడా రుణామాఫీ కాలేదు.పొదుపు అక్కాచెల్లెమ్మల చెవుల్లో కూడా పువ్వులు పెట్టాడు. బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి వచ్చిందా అని అడుగుతున్నా..బంగారం రాలేదు కాని అన్నా బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయన్నా అని అంటున్నారు.

గతంలో రైతులకు,అక్కాచెల్లెమ్మలకు సున్నా వడ్డిలకు రుణాలు వచ్చేవి.పావలా వడ్డిలు వచ్చేవి. అక్కాచెల్లెమ్మలు బ్యాంకులకు వెళ్ళి హుందాగా వెళ్ళి సున్నా వడ్డి రుణాలు తీసుకునేవారు.రైతన్నలు సున్నా వడ్డితో క్రాప్‌ లోన్లు తీసుకుని  చిరునవ్వుతో వచ్చేవారు.చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత  మోసం చేశారు.ప్రజలంతా పొరుగురాష్ట్రాలకు వలస పోతున్నారు. తుపాన్లు బెడద,పెథాయ్‌ తుపాన్‌లో ఆరు నుంచి ఏడు లక్షల వరుకు పంట దెబ్బతింది.కాని ముఖ్మమంత్రి ఏమి చేస్తున్నారో  తెలుసా కేబినెట్‌ మీటింగ్‌లు పెట్టి మంత్రులతో  రైతుల గురించి మాట్లాడరు.వీళ్లు చేసిందేమిటో తెలుసా..గజదొంగలు వాటాలు పంచుకున్నట్లు కూర్చొంటారు ఈ పెద్ద మనుషులు.ఎవడికి భూములు ఇవ్వాలి.ఆ భూముల నుంచి కమీషన్లు ఎంత తీసుకోవాలి.రాజధాని భూములు నుంచి మొదలుపెట్టితే విశాఖ భూములు వరుకు ఏది వదిలిపెట్టడం లేదు.రైతులు పరిస్థితి దారుణంగా ఉంది. గిట్టుబాటు ధరలు లేవు.«ధ్యానం చేతికొచ్చింది. కాని ధాన్యం కొనడానికి కొనుగోలు కేంద్రాలు ఉన్నాయా అని అడుగుతున్నా..ఎక్కడ ఉండవు కారణం ఏమిటంటే చంద్రబాబే దళారీలకు కెప్టెన్‌..రైతులకు నుంచి తక్కువ ధరకు కొని హెరిటేజ్‌ ద్వారా ఎక్కువరేటుకు అమ్ముకుంటారు.బాబు వస్తే జాబు వస్తుందన్నారు. వచ్చిందా జాబు అని అడుగుతున్నా.. జాబు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇచ్చారా అని అడగుతున్నా. ప్రతీ ఇంటికి లక్షా పదివేలు చంద్రబాబు బాకీ పడ్డారు. 2లక్షల 40వేల ఉద్యోగాల్లో ఒకటయినా భర్తీ చేశారా ఈ చంద్రబాబు అని అడుగుతున్నా..చంద్రబాబు హయాంలో ఇంతంటి దారుణంగా పరిపాలన సాగిస్తున్నాడు. 

చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు గురించి డ్రామాలాడుతున్నారు. పోలవరం గేట్‌ను చంద్రబాబు ప్రారంభిస్తారంట. అశ్చర్యం ఏమిటంటే పోలవరం ప్రాజెక్టు పునాదులు దాటి ముందడుగు వేయలేదు. అక్షరాల 48 గేట్లు పెట్టాల్సి వుంటే ఒకో గేటు పెట్టడానికి సుమారు  2నెలలు పడుతోంది.అటువంటిది ఈ పెద్దమనిషి ఈ రోజు ఒక గేటు ప్రారంభిస్తారు. బిల్డప్‌ ఎలా ఇస్తున్నాడో తెలుసా.. ఆయనకు చెందిన పచ్చమీడియా ఆయన తానా అంటే అవి తందన్నా అంటాయి.గ్లోబెల్‌ ప్రచారానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఎవరైనా ఇంటికి గోడలు కట్టకుండా..ఇంటికి స్లాబు వేయకుండా..కాని ఇంటికి ప్రారంభోత్సవానికి అందర్ని పిలిచి భోజనాలు పెడితే మీరు ఆ మనిషి  ఏమంటారు అని అడుగుతున్నా.డ్యామ్‌కు గట్టు ఎలా కట్టాలో డిజైన్‌ కూడా చేయలేదు. కనీసం డిపిఆర్‌ కూడా ఒకే కాలేదు. ప్రాజెక్టులో చుక్క నీరు కూడా నిలపలేదు.నిర్వాసితులను తరలించలేదు.కాని ఈ పెద్దమనిషి ఏం చేస్తాడు గేట్లు పెట్టి ఆ గేట్లులో ఒకటికి ప్రారంభోత్సవం చేసి మనందరికి పెద్ద సినిమా చూపిస్తాడు.ఆ సినిమా పేరు ‘బాబు పాలనలో పోలవరం ప్రాజెక్టు’. ఇక రాజధాని గురించి రెండో సినిమా చూపిస్తాడు.బాహుబలిలో సెట్టింగ్‌లే మన రాజధాని కోట.చంద్రబాబు గ్రాఫిక్స్‌..ఎప్పుడైనా రాజధాని ఎలా ఉంది అని అడిగితే చంద్రబాబు ఏం చెబుతాడో తెలుసా..బాహుబలి సినిమా చూడండి అని చెబుతాడు.ఐదేళ్లయ్యింది. ఒక ఇటుక కూడా పర్మినెంట్‌ అని కనిపించదు. రాజధానిలో అంతా తాత్కాలికమే కనిపిస్తోంది.తాత్కాలిక భవనాలు పరిస్థితి ఏమిటో తెలుసా బయట ముండించెల వర్షం పడితే లోపల ఆరు ఇంచెల నీళ్లు కనబడతాయి.రాజధాని నా స్వ ప్నమంటూ చంద్రబాబు గ్రాఫిక్స్‌ చూపిస్తారు.

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి అటకెక్కించారు.నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు రూ.550 కోట్ల బకాయిలు కూడా చెల్లించలేదు.దీంతో ఆసుప్రతులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన పరిస్థితి ఏర్పడింది.లంచం లేనిదే ఇవాళ ఏ పనీ జరగని పరిస్థితి. గ్రామగ్రామాన జన్మభూమి కమిటీల మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. చంద్రబాబు కరువు ఇచ్చాడు. తుపాన్లు ఇచ్చాడు..చంద్రబాబు ఇసుక దోపిడీ..నిరుద్యోగం ఇచ్చాడు. నాలుగున్నర ఏళ్లు కాలంలో చంద్రబాబు ఇచ్చింది ఇదే..ప్రభుత్వం చేసిన అభివృద్ధి సమాజంలో కనబడాలి.తెల్లకాగితాల్లో కనిపించేది అభివృద్ధి ఎలా అవుతుంది..ముగ్గురు ఎంపీలను సంతలో పశువుల్లా కొన్న చంద్రబాబు ఇద్దరిని కేంద్రమంత్రులుగా చేశారు.నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేశారు.నేడు కేంద్రం న్యాయం చేయలేదంటూ కొత్తపల్లవి అందుకున్నారు. బీజేపీతో చంద్రబాబు అంటకాగినప్పుడు..రాష్ట్ర ద్రోహి రాహుల్‌ అంటూ నాడు చంద్రబాబు విమర్శించారు.బీజేపీతో విడాకులు తీసుకున్నాక కాంగ్రెస్‌తో దోస్తీ కట్టారు.నాడు రాహుల్‌ను తిట్టినట్టే నేడు మోదీని తిడతారు.రెండు సినిమాలు ఒక్కటే పాత్రలు మారాయి.వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే నవరత్నాల పథకాలు అందిస్తాం. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపు చేస్తాం.ఎన్ని లక్షల ఖర్చయినా పేదవాడికి తోడుగా ఉండి వైద్యం చేయిస్తాం.ఉచిత ఆపరేషన్‌తో పాటు విశ్రాంతి సమయంలో డబ్బులిచ్చే సౌకర్యం కల్పిస్తాం.ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తెస్తామన్నారు.
  


తాజా వీడియోలు

Back to Top