జీడీపీ ఏ రకంగా పెరిగింది బాబూ..?

రాష్ట్రంలో కనుచూపుమేరలో అభివృద్ధి అన్నదే కనిపించడం లేదని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాష్ట్రంలో గ్రోత్ రేటు 12 శాతం ఉందని బాబు మాట్లాడుతున్నారని...అది ఏవిధంగా వచ్చిందో చెప్పమంటే సమాధానం చెప్పడం లేదని దుయ్యబట్టారు. ప్రతీ సంవత్సరం వస్తున్న ఆదాయ లెక్కలతో ముందుకు రావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవినీతి కోసం దోపిడీ కోసం పట్టిసీమను కట్టిన ఈ ప్రభుత్వం నదుల అనుసంధానం చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అన్ని రంగాలను మీరు నిర్లక్ష్యం చేసినప్పుడు ఏవిధంగా గ్రోత్ రేటు పెరిగుతుందని బొత్స సత్యనారాయణ బాబు సర్కార్ ను నిలదీశారు. 
Back to Top