న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా

న్యూఢిల్లీ: తాను ఎవరినీ బాధపెట్టేలా వ్యాఖ్యలు చేయలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. తన వ్యాఖ్యలపై ఎవరైనా బాధపడుంటే ఉపసంహరించుకుంటానని ఆమె తెలిపారు. తన సస్పెన్షన్ను సవాలు చేస్తూ రోజా దాఖలు చేసిన పిటిషన్పై  ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.  తాను ఇచ్చిన వివరణ లేఖను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించడం పట్ల రోజా హర్షం వ్యక్తం చేశారు.

కాల్మనీ అంశంలో మహిళల సమస్యలపై పోరాడానని, అసెంబ్లీలో ఈ అంశంపై చర్చించి పరిష్కరించమని చెప్పానని రోజా తెలిపారు.  అసెంబ్లీ ఆవరణలో తనను ఎవరైనా అడ్డుకుంటే సీరియస్గా పరిగణిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు రోజా పేర్కొన్నారు.


Back to Top