హైదరాబాద్: వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం ఘటనపై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ రేపటికి వాయిదా పడింది. స్వతంత్ర సంస్థతో విచారణ కోరుతూ వైయస్ జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వం వేసిన సిట్ విచారణపై నమ్మకం లేదని, ఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు, డీజీపీలు కేసును నీరుగార్చేవిధంగా ప్రకటనలు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారణ శుక్రవారానికి వాయిదా వేసినట్లు న్యాయవాది పేర్కొన్నారు.