రాజ‌న్న‌దొర‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంపై హ‌ర్షం

డుంబ్రిగుడ (విశాఖ‌):  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర‌కు పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా సాలూరు నియోజక వర్గ ఎమ్మెల్యే రాజన్న దొరకు బాధ్యతలను అప్పగించడంపై డుంబ్రిగుడ మండల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరమ సర్పంచ్‌ సుబ్బారావు,లైగండ సర్పంచ్‌ సుబ్బారావులు బుధవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరకు పార్లమెంటరీ నియోజక వర్గ పార్టీ బాధ్య‌త‌ల‌ను ఆయనకు అప్పగించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కోసం పార్టీ కార్యకర్తలతో కలిసి రానున్న వచ్చే ఎన్నికల్లో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా గ్రామాల్లో పనిచేస్తామన్నారు. అరకు నియోజక వర్గంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీలను గెలిపించుకుని తీరుతామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు  జి మొద్నో,బంగురు విజయకుమార్, దేవినాయుడు,హరి తదితరులు పాల్గొన్నారు.

Back to Top