పాద‌యాత్రికుడికి చిరు కానుకఒంగోలు: ప్ర‌జ‌ల కోసం క‌ష్ట‌ప‌డుతున్న పాద‌యాత్రికుడు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అరుదైన కానుక ల‌భించింది. ఓ చిన్నారి ప్రేమ‌తో ఓ హుండీని జ‌న‌నేత‌కు కానుక ఇచ్చి త‌న అభిమానాన్ని చాటుకున్న ఘ‌ట‌న ఇవాళ చోటు చేసుకుంది. వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 94వ రోజు ప్ర‌కాశం జిల్లా కొండెపి నియోజ‌క‌వ‌ర్గంలో సాగుతోంది. ఈ సంద‌ర్భంగా ఓ చిన్నారి త‌న తండ్రితో పాటు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో పాల్గొని  తాను ఎప్ప‌టి నుంచే రూపాయి..రూపాయి పొగేసి దాచిపెట్టిన కానుక పెట్టెను వైయ‌స్ జ‌గ‌న్‌కు విరాళంగా ఇచ్చింది. చిన్నారి చూపిన ప్రేమ‌కు వైయ‌స్ జ‌గ‌న్ మంత్ర‌ముగ్ధుడ‌య్యారు. ఆమెను ఆప్యాయంగా ముద్దాడి ఆశీర్వ‌దించారు.  ఆ చిన్నారి ఇచ్చిన విరాళం పాద‌యాత్ర‌లో ఉన్న ప‌లువురిని ఆలోచింప‌జేసింది.  ఆ చిన్నారికి ఎంత పెద్ద మ‌న‌స్సో క‌దా!

Back to Top