<strong>శ్రీకాకుళంః </strong>నిత్యం ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే వ్యక్తి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కళావతి అన్నారు. అన్ని వర్గాల సంతోషంగా ఉండాలనే తాపన వైయస్ జగన్‌లో ఉందన్నారు.అందుకే నవరత్న పథకాలు ప్రకటించారని ఆ పథకాలు అందరికి అందేలా ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమిస్తామని ప్రకటించడం ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఉద్యోగాల విప్లవం తెస్తామన్న ప్రకటన చాలా గొప్పదన్నారు. అందరికి ఉపాధి కల్పించాలని జననేత తాప్రతాయపడుతున్నారన్నారు.వైయస్ జగన్ సీఎం అయితే అందరికి మేలు జరుగుతుందన్నారు.ప్రజలందరూ వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఒక అవకాశం ఇచ్చి ఆయన పరిపాలన చూడాలని కోరారు. దివంగత మహానేత వైయస్‌ఆర్ పాలనను తలపించే విధంగా వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజలందరికి వైయస్ జగన్ మేలు చేస్తారన్నారు.