సామాన్యుల పొట్టగొట్టి పచ్చచొక్కాలకు దోచిపెట్టాడు

  • బాబు పాలనలో మళ్లీ వలసలు మొదలయ్యాయి
  • ఉపాధి నిధులను దుర్వినియోగం చేస్తున్నారు
  • పేదలకు తిండి లేకుండా చేస్తున్న బాబును ఏమనాలి..?
  • పచ్చచొక్కాలకే తప్ప సామాన్యులకు పథకాలు అందడం లేదు
  • ప్రభుత్వంపై వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజం
విశాఖపట్నంః ఉపాధి హామీ నిధులను దుర్వినియోగం చేస్తూ, ప్రభుత్వం సామాన్యుల పొట్టకొడుతుందని  వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.  ఉపాధి కూలీలకు ప్రభుత్వం పని కల్పించడం లేదని అన్నారు. 2004కు ముందున్న పరిస్థితులే మళ్లీ రాష్ట్రంలో కనిపిస్తున్నాయని...పనిలేక ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ...ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. గ్రామాల్లో సంక్షేమం కనుచూపు మేరల్లో కూడ కానరావడం లేదని అన్నారు. ఎంతసేపు ప్రతిపక్షాన్ని ఆడిపోసుకొని పబ్బం గడుపుకుంటూ అధికార  టీడీపీ కాలక్షేపం చేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎక్కడ అవినీతి, చట్టవ్యతిరేక కార్యక్రమాలు జరిగితే అక్కడ వైయస్సార్సీపీ ఉంటుందని, ప్రభుత్వ తీరును ఎండగడుతుందని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తాలుకా హక్కులు కాపాడడమే మా బాధ్యత అని అన్నారు. 

దివంగత ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ట్రంలోని పేద ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపాధి హామీ పథకం అమలు అయిందని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. 2004కు ముందు ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లిన వారంతా వైయస్ఆర్ హయాంలో మళ్లీ గ్రామాలకు తిరిగి వచ్చి పిల్లా పాపలతో చల్లంగా ఉండేవారని చెప్పారు. ప్రస్తుతం మళ్లీ రాష్ట్రంలో వలసలు మొదలయ్యాయని అన్నారు. ఉపాధి కూలీలకు 15 రోజుల్లో పని కల్పించకపోతే అందుకు సంబంధించిన అధికారి శిక్షార్హులని చట్టంలో ఉన్నప్పటికీ పనులు కల్పించకపోవడం దురదృష్టకరమన్నారు. ఉపాధి నిధులు కూలీలకు చెందకుండా చెరువుల దగ్గర మిషన్ లతో పనిచేయిస్తూ టీడీపీ నాయకులు, వారి అనుచరులు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైయస్సార్సీపీపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని బొత్స హెచ్చరించారు.  దోపిడీని అరికట్టమంటే రాక్షసులని మాట్లాడుతున్నారని....మరి రాష్ట్ర ప్రజలను తిండి లేకుండా చేస్తున్న బాబును ఏమనాలని ప్రశ్నించారు. కేంద్రం నుంచి ఏపీకి వచ్చిన నిధులను బాబు దుర్వినియోగం చేశారని బొత్స ఫైర్ అయ్యారు. పేదల కడుపులు కొట్టి టీడీపీ  నాయకులకు దోచిపెట్టారని నిప్పులు చెరిగారు. బాబు  నోరు విప్పితే అబద్ధాలేనని బొత్స దుయ్యబట్టారు. ఎంతసేపు ప్రచార ఆర్భాటమే తప్ప పేదలను ఆదుకోవాలన్న చిత్తశుద్ధే లేదని మండిపడ్డారు. బాబు పాలనలో  పచ్చచొక్కాలకే తప్ప సామాన్యులకు ఎక్కడా సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. విచారణకు వస్తే నిరూపిస్తామని టీడీపీకి సవాల్ విసిరారు.
Back to Top