ఈ విపత్తుకు ప్రభుత్వాలే కారణం: బోస్

హైదరాబాద్, 02 ఏప్రిల్ 2013:

రాష్ట్రంలో విద్యుత్తు రంగం విపత్కర పరిస్థితుల్లో చిక్కకుకుందని మాజీ మంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలే కారణమని ఆయన మండిపడ్డారు. విద్యుత్తు సమస్యపై ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న  చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలు తగ్గించేవరకూ తమ పార్టీ  పోరు కొనసాగిస్తూనే ఉంటుందని సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు.

Back to Top