ఎడవల్లిలో మహానేత విగ్రహావిష్కరణ

ఎడవల్లి(గోపాలపురం) 17 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల శుక్రవారం సాయంత్రం పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోకి ప్రవేశించారు.  శ్రీమతి షర్మిలకు గోపాలపురం ఎమ్మెల్యే వనిత, అభిమానులు, కార్యకర్తలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఎడవల్లి గ్రామం చేరుకున్న శ్రీమతి షర్మిల మహానేత డాక్టర్ వైయస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాలవేసి నివాళులర్పించారు. శ్రీమతి షర్మిల గురువారం సాయంత్రం రావికంపాడు వద్ద రెండు వేల కిలోమీటర్ల పాదయాత్రను పూర్తిచేసిన విషయం తెలిసిందే.

Back to Top